Extra Ordinary Man: నితిన్ కొత్త సినిమా నుండి రిలీజైన పోస్టర్ చూసారా?
గత కొన్ని రోజులుగా హీరో నితిన్ వరుసగా అపజయాలను మూట కట్టుకున్నాడు. భీష్మ తర్వాత చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో క్లాస్ గా కనిపిస్తున్న నితిన్, మాస్ స్టైల్ లో విజిల్ వేస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.