Daksha Teaser: పదేళ్ల తరువాత లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ నుంచి సినిమా.. 'దక్ష' టీజర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు పదేళ్ల తర్వాత 'లక్ష్మి ప్రసన్న పిక్చర్స్'బ్యానర్‌లో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ)సినిమాలో మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రాన్ని వంశీకృష్ణ దర్శకత్వం వహించగా,నిర్మాతలుగా మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు వ్యవహరించారు. ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు విడుదల చేశారు.టీజర్‌తో ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని ప్రకటించారు. ఐదేళ్ల తరువాత మంచు లక్ష్మి తెరపైకి తిరిగి రాబోతున్నారు. 'దక్ష'లో ఆమె డైనమిక్ మహిళా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో మంచు మోహన్ బాబు,కీలక పాత్రలో సముద్రఖని, మలమాళ నటుడు సిద్ధిక్,చైత్ర శుక్ల తదితరులు నటించనున్నారు.
వివరాలు
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మంచు లక్ష్మి
2015లో 'లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' బ్యానర్‌లో 'మామ మంచు అల్లుడు కంచు' విడుదలయ్యింది. అప్పుడు నుండి దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు 'దక్ష' సినిమా రిలీజ్ కానుంది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించారు.క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మంచు లక్ష్మి పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. యాక్షన్ సీన్స్‌లో ఆమె ప్రదర్శన ఆకట్టుకుంటుంది. టీజర్‌లో సరికొత్త థ్రిల్లింగ్ అంశాలు చూపించబడ్డాయి. ఫుల్ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ శైలిలో సినిమా రూపొందించబడిందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. మూడు సంవత్సరాల క్రితం 'అగ్ని నక్షత్రం' పేరుతో ఈ చిత్రం ప్రకటించారు. ఇప్పుడు టైటిల్‌ను మార్చి, 'దక్ష'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.