Page Loader
Devara: ఓవర్సీస్‌లో 'దేవర' హవా.. నార్త్ అమెరికాలో ఎన్ని మిలియన్స్ అంటే?
ఓవర్సీస్‌లో 'దేవర' హవా.. నార్త్ అమెరికాలో ఎన్ని మిలియన్స్ అంటే?

Devara: ఓవర్సీస్‌లో 'దేవర' హవా.. నార్త్ అమెరికాలో ఎన్ని మిలియన్స్ అంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2024
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే 'దేవర' భారీ సంచలనాలు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్‌ మాత్రమే 2 మిలియన్ డాలర్లు దాటడం విశేషం. ఆర్ఆర్ఆర్ తరువాత ఇదే 2 మిలియన్ డాలర్ మార్క్‌ దాటిన సినిమా కావడం గమనార్హం.

Details

విడుదలకు ముందే 'దేవర' సంచలన రికార్డు

ప్రీమియర్‌ షోలు, డే-1 ప్రీ సేల్స్‌ కలిపి 2.5 మిలియన్ డాలర్లు దాటడంతో, ఈ సినిమా విడుదలకు మూడు రోజులు ముందు నుంచే బుకింగ్స్‌ సునామీలా దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్‌ చూస్తే ప్రేమియర్‌ డే కి $2.5 - $3 మిలియన్ వసూళ్లు సాధించి, ఫస్ట్ వీకెండ్‌ నాటికి $5 మిలియన్ దాటి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. సినిమాపై పాజిటివ్‌ టాక్ వస్తే, ఈ నంబర్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.