Dhanashree Verma: చాహల్‌తో విడాకులు.. గృహ హింసపై పాట విడుదల చేసిన ధనశ్రీ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోయిన సంగతి తెలిసిందే.
వీరికి ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీకి భరణంగా రూ. 4.75 కోట్లు చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించగా, అందులో భాగంగా రూ. 2.37 కోట్లు ఇప్పటికే చెల్లించారు.
2020 డిసెంబర్ 22న చాహల్, ధనశ్రీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ధనశ్రీ వర్మ ఒక దంత వైద్యురాలిగా ఉండటమే కాకుండా, కొరియోగ్రాఫర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కూడా మంచి గుర్తింపు సంపాదించారు.
వివరాలు
కొత్త మ్యూజిక్ ఆల్బమ్ విడుదల
ఇదిలా ఉంటే, చాహల్‌తో విడాకులు తీసుకున్న కొన్ని గంటల్లోనే ధనశ్రీ తన కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసింది.
మార్చి 20న టీ-సిరీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తాజా మ్యూజిక్ వీడియో"దేఖా జీ దేఖా మైనే" విడుదల అయింది.
ఈ పాట కథాంశాన్ని పరిశీలిస్తే, రాజ కుటుంబానికి కోడలిగా చేరిన ధనశ్రీ అక్కడ తన భర్త ద్వారా గృహ హింస,శారీరక,మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లుగా చూపించారు.
చివరికి, తన భర్తను వదిలిపెట్టి స్వేచ్ఛగా బయలుదేరే మహిళగా ధనశ్రీ పాత్రను మలిచారు.
ఈ వీడియో ఆమె నిజజీవితాన్ని ప్రతిబింబిస్తున్నదని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం విడాకుల రోజునే ఇలాంటి పాటను విడుదల చేయడం ఉద్దేశపూర్వకమా?అని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు.