LOADING...
Danush : ధనుష్‌పై ప్రశంసల వర్షం.. కలాం బయోపిక్‌పై ఓం రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ధనుష్‌పై ప్రశంసల వర్షం.. కలాం బయోపిక్‌పై ఓం రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Danush : ధనుష్‌పై ప్రశంసల వర్షం.. కలాం బయోపిక్‌పై ఓం రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు బాలీవుడ్‌ ఫేమస్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆదిపురుష్' తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న ఆయన, ఈసారి తన పూర్తి శ్రద్ధను కలాం బయోపిక్‌పై కేంద్రీకరించారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచేలా ఓం రౌత్ తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఓం రౌత్, కలాం పాత్ర పోషిస్తున్న ధనుష్‌ గురించి విశేషంగా మాట్లాడారు.

Details

ధనుష్‌ అద్భుతమైన నటుడు

'ధనుష్‌ ఒక అద్భుతమైన నటుడు. ఈ పాత్రకు ఆయన తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు. ప్రతి సన్నివేశంలోనూ కలాం గారే కనిపిస్తారు. ఈ పాత్రను ఆయన ఒప్పుకోవడం నా అదృష్టం. ఈ సినిమా కేవలం ఒక బయోపిక్ మాత్రమే కాదు, అందులో కమర్షియల్ టచ్ కూడా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అంతేకాదు, ఈ సినిమా కోసం ఓం రౌత్ కలాం గారి కుటుంబ సభ్యులు, ఆయన స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన శాస్త్రవేత్తలను కూడా సంప్రదించారు. నిజ జీవితానికి దగ్గరగా, తప్పులు లేకుండా కథను తెరకెక్కించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

Details

అన్ని భారతీయ భాషల్లో రిలీజ్

ఈ భారీ ప్రాజెక్ట్‌ను భూషణ్ కుమార్, అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్, కృష్ణ్ కుమార్ వంటి ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ తనకు ఉన్న ఇతర కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకున్నాక, ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్‌ 'కలాం : ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా ఫిక్స్ చేశారు. ఒకే భాషకు పరిమితం కాకుండా, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.