OM Movie: సెన్సార్ దెబ్బకు టైటిల్ మార్చుకుంటున్న ధనుష్ మూవీ.. అసలు కథ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, 'అమరన్' ఫేమ్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు 'ఓం' అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అనుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ టైటిల్‌ను 'ఓ.ఎం' (O.M)గా మార్చబోతున్నారనే వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. టైటిల్ విషయంలో సెన్సార్ పరమైన అభ్యంతరాలు తలెత్తడంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వివరాలు
విజయ్ 'జననాయగన్' విషయంలోనూ ఇలాగే..
టైటిల్ లేదా పదాల విషయంలో సెన్సార్ మార్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో దళపతి విజయ్ నటించిన 'జననాయగన్' (Jana Nayagan) సినిమా విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు సమాచారం.
ఆ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన ఓ గ్యాడ్జెట్ రిఫరెన్స్‌లో 'OM' అనే పదాన్ని ఉపయోగించారు.
అయితే సెన్సార్ అభ్యంతరాల కారణంగా దాన్ని 'MM'గా మార్చాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ధనుష్ సినిమా టైటిల్ విషయంలోనూ ఇదే తరహా మార్పు జరుగుతోందనే ప్రచారం సాగుతోంది.
వివరాలు
'ఓం' టైటిల్ వెనుక అసలు కారణం ఇదే!
అసలు ఈ సినిమాకు 'ఓం' అనే టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు? దీనికి ఆధ్యాత్మికతకు లేదా పరమశివుడికి ఏమైనా సంబంధం ఉందా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు.
ఈ సినిమా కథ ప్రధానంగా రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, తిరువణ్ణామలై పట్టణాల మధ్య సాగుతుందని ఆయన వెల్లడించారు.
అంతేకాదు ఇందులో సాయిపల్లవి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఓ ఆపరేషన్ కోడ్ నేమ్ 'OM' అని వివరించారు.
కథలోని పాత్రల జీవితాల్లో ఆధ్యాత్మికతకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ కారణాలతోనే సినిమాకు 'OM' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.