
Dhanush : మరికొన్ని గంటల్లో 'రాయన్' స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాయన్. ఈ మూవీ ధనుష్ కెరీర్‌లోనే 50వ సినిమా కావడం విశేషం.
ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా తెరకెక్కిన ఈ మూవీ జూలై 26న థియేటర్లలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది.
కోలీవుడ్ లో రూ. 100 కోట్లు, తెలుగులోనూ 550 కోట్లు పైగానే వసూళ్లు సాధించింది.
థియోటర్లలో అలరించిన రాయన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
Details
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
ఇవాళ అర్ధరాత్రి నుంచే రాయన్ మూవీ ఓటీటీలో రానుంది.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి కోసం హీరో ఎలాంటి పోరాటం చేశారనే కథను ఇందులో అద్భుతంగా చూపించారు.
ఈ సినిమాలో అపర్ణ, సందీప్ కిషన్, దుషారా విజయన్ కీలక పాత్రలో నటించారు.