Dil Raju : 'గేమ్ ఛేంజర్' కోసం పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, TFD కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మధ్య భేటీ జరిగింది.
ఈ భేటీలో టాలీవుడ్‌లో గతంలో ఏర్పడిన పరిస్థితుల గురించి దిల్ రాజు పవన్ కళ్యాణ్‌కు వివరణిచ్చారు.
అదేవిధంగా దిల్ రాజు నిర్మించిన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు విజయవాడలో జరిగిన కటౌట్ లాంచింగ్‌లో ప్రకటించారు.
ఈ నేపథ్యంలో, 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీమియర్ ఈవెంట్‌ను జనవరి 4 లేదా 5 తేదీల్లో విజయవాడలో నిర్వహించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.
Details
జనవరి 10న గ్రాండ్ రిలీజ్
పవన్ కళ్యాణ్ సమయానుకూలంగా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంటుందని, అందుకే ఈ ప్రోగ్రామ్ గురించి చర్చిస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించిన టికెట్ల రేట్లపై కూడా పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరగనున్నట్లు సమాచారం.
ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడం, ప్రీమియర్ షోలు, తెలంగాణలో బెనిఫిట్ లేని కారణంగా ఏపీలో బెనిఫిట్ షోల నిర్వహణ గురించి కూడా ఈ భేటీలో చర్చ జరుగుతుందని అంచనా వేశారు.