LOADING...
Chiranjeevi - Balakrishna: బాలకృష్ణ క్లాప్‌తో ప్రారంభమైన చిరంజీవి మూవీ..
బాలకృష్ణ క్లాప్‌తో ప్రారంభమైన చిరంజీవి మూవీ..

Chiranjeevi - Balakrishna: బాలకృష్ణ క్లాప్‌తో ప్రారంభమైన చిరంజీవి మూవీ..

వ్రాసిన వారు Moogati Shabari
Apr 18, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు. ఒకదాని తరువాత ఒకటి హిట్స్ సాధిస్తూ మంచి ఫామ్‌లో ఉన్నారు. తాజాగా విడుదలైన అఖండ 2 చిత్రంతో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఇదే కాంబినేషన్‌లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు రూపొందుతున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

ఆ మూవీకి క్లాప్ కొట్టిన బాలయ్య..

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస చిత్రాలతో తన సత్తా చాటుతున్నారు. ఇటీవల విడుదలైన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆయన మరోసారి భారీ హిట్‌ను అందుకున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిరంజీవి, బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం గుర్తుకు వస్తుంది. చిరంజీవి కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఒక సినిమాకు బాలకృష్ణ క్లాప్ కొట్టారన్న విషయం చాలామందికి తెలియదు. అదే ఘరానా మొగుడు సినిమా.

వివరాలు

తొలిసారి పది కోట్ల షేర్..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం అప్పుడు భారీ విజయాన్ని సాధించింది. ఇందులో చిరంజీవికి జంటగా నగ్మా, వాణి విశ్వనాథ్ నటించారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందించారు. సినిమాలోని అన్ని పాటలు విశేష ఆదరణ పొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మొదటి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 34 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పట్లో ఈ చిత్రం పది కోట్లకు పైగా షేర్ సాధించి రికార్డు సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారిగా పది కోట్ల షేర్ అందుకున్న చిత్రంగా ఘరానా మొగుడు నిలిచింది.

Advertisement