Double Ismart: నైజాంలో 'డబుల్ ఇస్మార్ట్' విడుదల చేసేది ఎవరంటే .. అధికారిక ప్రకటన చేసిన టీం
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). ఈ సినిమాకి పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్నడబుల్ ఇస్మార్ట్ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం,హిందీ, కన్నడ,మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరో రెండు రోజుల్లో ఈ మూవీ థియేటర్లో విడుదల కానుండగా ఇప్పటి వరకు ఈ మూవీ నైజాం రిలీజ్‌పై క్లారిటీ రాలేదు. లైగర్ ఫ్లాప్ వల్ల 'డబుల్ ఇస్మార్ట్' విషయంలో డిస్ట్రిబ్యూటర్లు మెలికలు పెడుతూ వస్తున్నారట.
సినిమాలో మంచి ఎమోషన్స్
మొత్తానికి పూరి జగన్నాధ్ టీం అన్ని సమస్యలను పరిష్కరించింది. నిన్న ఫిలిం ఛాంబర్‌లో జరిగిన చర్చల తర్వాత ఈ సమస్య సద్దుమణిగింది. ఈ సినిమాని చివరికి ప్రైం షో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పూరీ, చార్మి ఒప్పుకున్నారట. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ . పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మీ కౌర్, పూరి జగన్నాధ్ ఈ పాన్ ఇండియన్ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ట్రైలర్‌లో చెప్పినట్లుగా, సినిమాలో మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి.