
మీడియా సపోర్టు కోరిన హీరో శ్రీ విష్ణు
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ రాజ్ కుమార్, నేహా పఠానీ హీరో హీరోయిన్లుగా ఎన్వీఆర్ ప్రొడక్షన్స్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'ఏం చేస్తున్నావ్'.
భరత్ మిత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ రీసెంట్ గా సామజవరగమన సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేసారు.
టీజర్ రిలీజ్ వేడుకలో శ్రీ విష్ణు మాట్లాడుతూ, ఏం చేస్తున్నావ్ అనే టైటిల్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉందన్నారు. ఒక్క ప్రశ్నలో ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయని, టీజర్ చూస్తుంటే యూత్‌కి నచ్చేలా ఉందని అన్నారు.
ఇంకా, చిన్న సినిమాలకు మీడియా సపోర్టు కావాలని శ్రీ విష్ణు అన్నారు.
Details
ప్రతీ పది నిమిషాలకు ఉర్రూతలూగించే సన్నివేశం
చిన్న సినిమాను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలంటే మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలనీ, ఈ సినిమాను మీడియా సపోర్ట్ చేయాలని అన్నారు.
ఏం చేస్తున్నావ్ చిత్ర దర్శకుడు భరత్ మిత్ర మాట్లాడుతూ, ఈ సినిమా 18-30ఏళ్ళ వయసు గల వారందరికీ విపరీతంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసారు.
థియేటర్లో చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని దర్శకుడు భరత్ తెలియజేసారు.
హాలీవుడ్ లెవెల్ హెలికాప్టర్ స్టంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని, ప్రతీ పది నిమిషాలకు సినిమాలోని ఏదో ఒక అంశం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని అన్నారు.
నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు.