LOADING...
coolie: సోమవారం స్లో అయినా.. 5 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్‌లోకి కూలీ!
సోమవారం స్లో అయినా.. 5 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్‌లోకి కూలీ!

coolie: సోమవారం స్లో అయినా.. 5 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్‌లోకి కూలీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా సోమవారం కలెక్షన్లలో కొద్దిగా పడిపోయినా, రికార్డుల వేటను మాత్రం కొనసాగిస్తోంది. సినీ పరిశ్రమలో రజనీకాంత్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద లాంగ్ వీకెండ్‌ను సత్తా చాటింది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, కేవలం మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఇప్పుడు ఐదు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి

Details

భారత్‌లో రూ. 200 కోట్లు

కూలీ సినిమా ఐదు రోజుల్లో భారత్‌లో రూ.200 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. సక్నిల్క్ ప్రకారం సోమవారం (ఆగస్టు 18) ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.9.36 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం నికర కలెక్షన్ రూ.203.86 కోట్లకు చేరుకుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ, ఫస్ట్ డే నుంచి కలెక్షన్లలో జోరును కొనసాగిస్తోంది.

Details

 ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా కూలీ కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి. ఈ చిత్రం రూ.400 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తమిళ సినిమాగా కూలీ రికార్డు సృష్టించింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భారతీయ ఓపెనర్‌గా కూడా నిలిచింది. నాలుగు రోజుల్లోనే కూలీ ప్రపంచవ్యాప్తంగా రూ.383 కోట్ల గ్రాస్ సాధించగా, ఐదో రోజు కలిపి అది రూ.400 కోట్లను అధిగమించింది. ఇందులో ఓవర్సీస్ కలెక్షన్లు రూ.160 కోట్లకు పైగా ఉండగా, ఇండియాలో రూ.240 కోట్లకు పైగా వసూలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా మరోసారి స్పష్టమైంది.

Details

వార్ 2తో పోటీ

కూలీకి మరో పెద్ద సినిమా వార్ 2తో పోటీ ఉంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న ఒకే రోజున విడుదలయ్యాయి. అయితే, తలైవా పవర్ ముందు వార్ 2 తేలిపోయినట్టే కనిపిస్తోంది. సోమవారం వార్ 2 రూ.7.52 కోట్ల నికర వసూళ్లు సాధించగా, దాని మొత్తం కలెక్షన్ రూ.182.27 కోట్లకు చేరింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, రజనీకాంత్ ప్రభంజనాన్ని ఎదుర్కోలేకపోతోంది. స్టార్ స్టడెడ్ కాస్ట్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ ముఖ్య పాత్రల్లో నటించారు.