Page Loader
 Double iSmart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్ డైరక్టర్ రివీల్
డబుల్ ఇస్మార్ట్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్ డైరక్టర్ రివీల్

 Double iSmart : 'డబుల్ ఇస్మార్ట్' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్ డైరక్టర్ రివీల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2023
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) డబుల్ ఇస్మార్ట్‌ (Double iSmart)తో బిజీ అయ్యాడు. డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'డబుల్ ఇస్మార్ట్'. ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా, ఈ మూవీని మార్చి 8, 2024న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరొక అప్డేట్‌ను మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇక 'డబుల్ ఇస్మార్ట్' సినిమా కోసం మణిశర్మనే సంగీత దర్శకుడిగా పూరీ ఎంచుకున్నాడు

 Details

డబుల్ ఇస్మార్ట్ కు నిర్మతగా కూడా వ్యవహరిస్తున్న పూరీ

ఇప్పటికే మణిశర్మ-పూరీ కాంబినేషన్ లో పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్ లాంటి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబాయ్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పూరీ జగన్నాథ్ వ్యవహరిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో, ప్యాన్ ఇండియా రేంజ్‌లో 'డబుల్ ఇస్మార్ట్'ను విడుదల చేయడానికి సన్మహాలను చేస్తున్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్'లో రామ్‌కు జోడీగా ఎవరు నటిస్తారో అన్న విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.