
Abir Gulal: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నటుడు హీరోగా తెరకెక్కిన 'అబీర్ గులాల్' భారత్‌లో బ్యాన్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటుడు ఫవాద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అబీర్ గులాల్'.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి వాణీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.పాకిస్థాన్ నటుడు ప్రధాన పాత్రలో ఉండటంతో ఈ సినిమా ప్రకటన వెలువడిన క్షణం నుంచే సోషల్ మీడియాలో బహుళ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
'బాయ్‌కాట్ అబీర్ గులాల్' అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
ఇక ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సినిమాపై మరింత ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈదాడి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని'అబీర్ గులాల్' సినిమాను నిషేధిస్తున్నట్టు అధికార వర్గాలు నిర్ణయం తీసుకున్నాయని జాతీయ మీడియా వార్తలందించింది.
కాగా,ఈ చిత్రం మే 9న థియేటర్లలో విడుదల కాబోతుందని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.
వివరాలు
వాణీ కపూర్ పై తీవ్రమైన విమర్శలు
ఇక యూట్యూబ్ ఇండియా ప్లాట్‌ఫారంపై ఈ సినిమాకు సంబంధించిన పాటలను తొలగించినట్లు సమాచారం.
అయితే ఈ విషయంలో చిత్ర నిర్మాతల నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
అదే రోజు ఉగ్రదాడి జరిగినా, స్పందించకుండా వాణీ కపూర్ సోషల్ మీడియా వేదికగా సినిమాకు ప్రమోషన్ చేస్తూ పోస్ట్ చేయడం వల్ల ఆమెపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
అలాగే, పాకిస్థాన్ నటులను ప్రోత్సహిస్తున్నారంటూ బాలీవుడ్ పరిశ్రమపై కూడా పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
కాగా, ఈ చిత్రం ఒక రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించబడింది. ఆర్తి ఎస్. బగ్దీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.