
Allu Arjun: ఒకే సినిమాలో నాలుగు పాత్రలు.. అల్లు అర్జున్ నుంచి మాస్, క్లాస్, ఎమోషన్ ట్రీట్!
ఈ వార్తాకథనం ఏంటి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రం 'AA 22' (వర్కింగ్ టైటిల్) గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద ఎక్స్‌పెక్టేషన్ నెలకొంది. ఈ చిత్రంలో బన్నీ నటించనున్న పాత్రల గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ అభిమానుల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నారన్న ప్రచారం మధ్యలో ఉండగానే, ఇప్పుడు అల్లు అర్జున్ తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా మొత్తం నాలుగు పాత్రల్లో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మూడు తరాల కథతో స్క్రీన్‌పై అల్లు అర్జున్ ఓ విశేష అనుభవాన్ని ప్రేక్షకులకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Details
ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
అట్లీ చెప్పిన క్యారెక్టర్‌ల్లో బన్నీకి భలే నచ్చిందట. ఈ విభిన్న పాత్రలకు తగిన విధంగా గెటప్‌లు, ప్రెజెంటేషన్‌పై బన్నీ టీమ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని టాక్. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఒకే సినిమాలో నాలుగు విభిన్న పాత్రలు చేయడం అల్లు అర్జున్ కెరీర్‌లో ఇదే మొదటిసారి అవుతుంది. ఈ సినిమా కేవలం కథే కాదు, బ్యాక్‌డ్రాప్ పరంగా కూడా డిఫరెంట్ కానుంది. సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ తిరిగే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన ఫిక్షనల్ వరల్డ్‌ను రూపొందించేందుకు చిత్రబృందం భారీ వీఎఫ్‌ఎక్స్ టీమ్‌ను రంగంలోకి దించిందట.
Details
వీఎఫ్‌ఎక్స్ సంస్థతో భారీ ఒప్పందం
హాలీవుడ్ స్థాయి విజువల్స్‌ను అందించేందుకు అక్కడి ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 'సన్ పిక్చర్స్' భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నాయికల పరంగా ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్‌లు నటించనున్నారు. అందులో దీపికా పదుకొణె పేరును నిర్మాతలు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. మిగతా నాయికలుగా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, భాగ్యశ్రీ బోర్సే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఒక కీలక పాత్ర కోసం హాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోను కూడా సంప్రదించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌తో బన్నీ, అట్లీ కాంబినేషన్ నుండి ప్రేక్షకులు ఊహించదగిన స్థాయి ఎమోషన్, యాక్షన్, విజువల్స్ అనుభవించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.