LOADING...
Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే!
ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే!

Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

కమల్‌ హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌లో మరోసారి రాబోతున్న చిత్రం 'థగ్‌లైఫ్‌'పై ఇప్పటికే సినీప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'నాయగన్‌' (1987) లాంటి గాంగ్‌స్టర్‌ డ్రామాతో చరిత్ర సృష్టించిన ఈ జోడీ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కలుస్తుండటం విశేషమే. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఈ కలయిక మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిన 'నాయగన్‌' గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మురికివాడల్లో పెరిగి, సామాన్య జీవితం నుంచి మాఫియా డాన్‌గా ఎదిగిన కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'నాయగన్' (తెలుగులో నాయకుడు), భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా నిలిచింది.

Details

కమలహాసన్ నటన అద్భుతం

1987 అక్టోబరు 21న విడుదలైన ఈ చిత్రం హాలీవుడ్ 'గాడ్‌ఫాదర్‌'కు భారతీయ అనుసరణగా పేరొందింది. ఈ సినిమాకు దర్శకుడు మణిరత్నం, నటుడు కమల్‌ హాసన్‌, సంగీత దర్శకుడు ఇళయరాజా అద్భుత కాంబినేషన్‌ గుండెను తాకే అద్భుత చిత్రంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రం సగటు గ్యాంగ్‌స్టర్‌ కథలకు భిన్నంగా పేదల జీవన పోరాటం, ప్రేమ కథ, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, నేపథ్య సంగీతం, హింసా సన్నివేశాలతో ముడిపడి ఉంటుంది. కమల్‌ హాసన్‌ వృద్ధుడిగా కనిపించి ముదుసలి నటనకు అందని మచ్చుతునకగా నిలిచారు. వేలు నాయకర్‌ పాత్రలో ఆయన రూపాన్ని సంప్రదాయ హిందూ వేషధారణ, మద్రాస్ వీనస్ స్టూడియోలో మురికివాడ సెట్‌ను తోట తరణి రూపొందించగా, నిజమైన ధారావిలోనూ చిత్రీకరణ జరిగింది.

Details

ఇది ఇళయారాజకు 400వ సినిమా

ఈ సినిమాతో శరణ్య నటిగా పరిచయం కాగా, కార్తీక, కుయిలీ, నాజర్‌, టినూ ఆనంద్‌, ఢిల్లీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. స్రవంతి రవికిశోర్ తెలుగు అనువాద నిర్మాతగా వ్యవహరించగా, పాటల సాహిత్యం రాజశ్రీ, వెన్నెలకంటి కలగలిపి అందించారు. ఇది ఇళయరాజా 400వ సినిమా. చిత్రంలోని థీమ్ సాంగ్ 'నీ గూడు చెదిరిందీ..' ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంలో నాలుగు తరాల గాయనులు పాటలు పాడడం విశేషం. జమునారాణి, పి. సుశీల, ఎం.ఎస్. రాజేశ్వరి, ఎస్పీ శైలజ, చిత్తు, బాలు, మనో వంటి గాయకుల గానంతో పాటలు జీవిత స్నేహితుల్లా అనిపించాయి. 'సందె పొద్దు మేఘం...' పాటలో కమల్‌కి డాన్స్ మూమెంట్స్ లేకపోవడమే ఇందుకు నిదర్శనం.

Details

'నాయగన్' చిత్రానికి గల ఘనతలు

'వేలు నాయకర్ డాన్స్ చేయడు' అనే కమల్ అభిప్రాయాన్ని మణిరత్నం స్వీకరించారు. క్లైమాక్స్ రూపకల్పనలో మణిరత్నం, కమల్‌ బొంబాయిలో వరద రాజన్‌ను కలిసి కథ చివర తుది దశను ప్రేరణగా తీసుకున్నారు. 'మీ మరణం ఎలా ఉంటుందని ఊహిస్తున్నారు?' అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఆధారంగా కథ చివర రూపుదిద్దుకుంది. కమల్ హాసన్ నటనలో వయస్సు, భిన్నభిన్న భావోద్వేగాలు స్పష్టంగా ప్రతిబింబించాయి. 1987లో బెస్ట్‌ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా ఆస్కార్‌కు భారత్‌ ఎంట్రీ టైమ్ మ్యాగజీన్‌ 'ఆల్ టైమ్ బెస్ట్ 100 మూవీస్'లో స్థానం 1988 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడు (కమల్), ఉత్తమ కళాదర్శకుడు (తోట తరణి), ఉత్తమ ఛాయాగ్రాహకుడు (పీసీ శ్రీరామ్)

Details

ప్రసిద్ధ డైలాగ్స్

బెంగళూరులో 224 రోజులు ప్రదర్శితం హిందీలో 'దయావాన్', 'వేలు నాయకన్' పేర్లతో రీమేక్ నలుగుర్ని బతికించే పని ఏదీ తప్పు కాదు నా వృత్తి నాతోనే పోనీ. వీళ్లకు ఎందుకిది? మీరు మంచివారా? చెడ్డవారా? - తెలియదు బాబూ. నాకే తెలియదు ఇంత గొప్ప చిత్రానంతరం మణిరత్నం-కమల్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రావటానికి దాదాపు 37 ఏళ్లు పట్టింది. దీనికి కారణం ప్రజలు 'నాయగన్'ను మర్చిపోకపోవడమే అని కమల్‌ చెబుతారు. 'నాయగన్'... భారతీయ చలనచిత్రానికి ఓ గౌరవ ప్రతీక!