Viswam: ఓటీటీలోకి గోపిచంద్ మూవీ విశ్వం.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో గోపీచంద్ కాంబోలో తాజగా విడుదలైన విశ్వం సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ స్పందన ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాలో బాగా ఉన్న కామెడీ థియేటర్లలో చూసిన వారిని నవ్వింపజేస్తుందని, రిలీజ్‌కు ముందు చెప్పినట్లుగా, నిజంగా చూపించారు.
అయితే, శ్రీను వైట్ల పదేళ్ల క్రితం ఎన్టీఆర్‌తో చేసిన బాద్‌షా సినిమా హిట్ తర్వాత ఆయనకు సరైన హిట్ మాత్రం కలగలేదు.
సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగిందని సమాచారం.
నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్లు, రెండు రాష్ట్రాల్లో కలిపి థియేట్రికల్ బిజినెస్ చేసింది.
వివరాలు
కామెడీ పండటంతో హిట్ టాక్
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్‌తో కలిపి రూ.1.5 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే, ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
భారీ గ్యాప్ తర్వాత.. 2018లో మాస్ మాహారాజా రవితేజతో రూపొందించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
దీని తర్వాత శ్రీను వైట్ల పెద్ద గ్యాప్ తీసుకుని విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ గ్యాప్ తర్వాత వచ్చినా, ఇది కమ్‌బ్యాక్ సినిమాగా చెప్పుకోవచ్చు.
సినిమా స్టోరీ రొటీన్‌గా ఉన్నా, కామెడీ పండటంతో హిట్ టాక్ వినిపిస్తోంది. దసరా పండుగ కావడంతో, బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్స్ కూడా రావడం జరుగుతోందని సమాచారం.
వివరాలు
అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీగా సొంతం చేసుకుంది. అయితే, దీపావళి కానుకగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం.
అక్టోబర్ 29 లేదా నవంబర్ 3వ తేదీన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.