Chiranjeevi : మా తాత మంచి రసికుడు.. ఆయన బుద్దులు మాత్రం ఎవరికీ రాకూడదు : చిరంజీవి ఫన్నీ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి తన రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్న ఆయన, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రాలను లైన్‌లో పెట్టారు.
ఇతర చిత్రాలకు మద్దతుగా వివిధ ఈవెంట్స్‌కు హాజరవుతున్నారు.
ఇటీవల విశ్వక్ సేన్ 'లైలా' సినిమా ప్రీ-రిసీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి, తాజాగా బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ-రిసీజ్ వేడుకలో కూడా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
Details
బ్రహ్మ ఆనందం - చిరంజీవి స్పెషల్ అప్పీరియన్స్
నిఖిల్ దర్శకత్వంలో, రాహుల్ యాదవ్ నక్క నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమా కోసం నిర్వహించిన ప్రీ-రిసీజ్ వేడుకకు చిరంజీవి గెస్ట్‌గా హాజరయ్యారు.
బ్రహ్మానందంతో ఉన్న స్నేహబంధంతో ఈ కార్యక్రమానికి వచ్చిన మెగాస్టార్, అక్కడ తన తాతయ్య గురించి ఓ సరదా విషయం వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఈ వేడుకలో యాంకర్ సుమ, చిరంజీవికి ఆయన తాతయ్య ఫొటోను చూపించి, ఆయన గురించి చెప్పాలని అడిగారు.
Details
తాతయ్య గురించి చిరు సరదా కామెంట్స్
చిరంజీవి స్పందిస్తూ ఇదుగో మా అమ్మగారి తండ్రి. ఆయన పేరు రాధాకృష్ణమ నాయుడు. నెల్లూరులో ఉండేవారు, తర్వాత మొగల్తూరుకు షిఫ్ట్ అయ్యారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.
చాలా రసికుడు. ఆయన బుద్ధులు మాత్రం ఎవరికీ రాకూడదు అని మా కుటుంబంలో చెప్పేవాళ్లు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
మా తాతయ్యకు మూడు అమ్మమ్మలు - నాలుగు, ఐదు ఉన్నాయా నాకు తెలియదని చమత్కరించడంతో సభలో నవ్వుల సందడి నెలకొంది.
సినీ పరిశ్రమలో అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని, మా తాతను ఆదర్శంగా తీసుకోవద్దని మా వాళ్లు నన్ను పంపారు. కానీ ఆయన దాతృత్వ గుణం మాత్రం కొంత నేర్చుకున్నానని చిరు వెల్లడించారు.