Meenakshi Chaudhary: బోల్డ్ సీన్స్‌పై గుంటూరు కారం హీరోయిన్ క్లారిటీ
టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో నటి మీనాక్షి చౌదరి బిజీగా ఉంది. ఈ మధ్యే హిట్-2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అమె, స్టార్ హీరోల సరసన నటించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం' సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ మూవీకి తమన్ స్వరాలు సమకూర్చగా, ఈ భారీ ప్రాజెక్టుకు నిర్మాతగా నాగవంశీ ఉన్నారు. ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూ హజరైన మీనాక్షి చౌదరి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. కెరీర్ ప్రారంభంలోనే మంచి సినిమాల్లో ఛాన్స్ దొరకడం చాలా ఆనందంగా ఉందని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది.
అశ్లీల సన్నివేశాల్లో నటించకూడదని ఫిక్స్ అయ్యా : మీనాక్షి చౌదరి
తాను చాలా స్క్రిప్టులు వింటున్నానని, ప్రేక్షకులకు గుర్తిండిపోయే పాత్రలే చేస్తేనే ఆదరిస్తారని, ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్నానని మీనాక్షి పేర్కొంది. తనకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే అలాంటి సీన్స్ లో నటించనని, అలా చాలా అవకాశాలొచ్చిన ఒప్పుకోలేదని, ముఖ్యంగా అశ్లీల సన్నివేశాల్లో అసలు నటించకూడదని ఫిక్స్ అయ్యాయని ఆమె తెలిపింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి, మహేష్ బాబుతో పాటు వరుణ్ తేజ్, విశ్వక్ సేన్ సినిమాలతో బీజీగా ఉంది.