
Happy birthday Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నట ప్రస్థానం సాగిందిలా
ఈ వార్తాకథనం ఏంటి
చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత తనకంటూ సెపరేట్ గా అభిమానగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సెప్టెంబర్ 2న పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక కథనం.
పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ తో చదువు ఆపేసారు. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు.
గురువు సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకుని అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1996లో రిలీజైన ఈ సినిమాను ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించారు.
ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఏర్పడ్డారు.
Details
ఖుషి తర్వాత ఇబ్బంది పెట్టిన వరుస ఫ్లాపులు
ఇటీవల తొలిప్రేమ రీ రిలీజ్ అయినపుడు థియేటర్లలో రద్దీని ప్రత్యక్షంగా చూసాము. ఇన్నేళ్లయినా ఆ సినిమాకున్న క్రేజ్ తగ్గలేదంటే అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు.
తొలిప్రేమ తర్వాత తమ్ముడు, బద్రి, ఖుషి వరుసగా హిట్టయ్యాయి. ఆ తర్వాతే పవన్ కెరీర్లో ఫ్లాప్స్ మొదలయ్యాయి. 2003లో రిలీజైన జానీ తర్వాత జల్సా (2008) వరకు పవన్ కు సరైన హిట్ పడలేదు.
ఇక 2012లో గబ్బర్ సింగ్ తో మరో హిట్ అందుకున్నారు. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపింది. ఆ తర్వాత అత్తారింటికి దారేదీ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది.
Details
అటు జనంలో ఉంటూనే సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్
అత్తారింటికి దారేది సినిమా తర్వాత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోయారు. అటు జనంలో ఉంటూనే ఇటు గోపాల గోపాల, కాటమ రాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ మొదలగు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందన వచ్చింది.
బ్రో తర్వాత పవన్ కళ్యాణ్ నుండి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలు వస్తున్నాయి.
వీటిల్లో అన్నింటికంటే ముందుగా ఓజీ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.