
Happy birthday Suriya: సూర్య నటించిన సినిమాల్లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో సూర్య ఈరోజు(జులై 23) 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. యాక్టర్ గా ఎన్నో విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు సూర్య.
విభిన్నమైన జోనర్లలో సినిమాలు తీసిన సూర్య, ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం కంగువ సినిమాతో వస్తున్నాడు.
అదలా ఉంచితే, సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 5బెస్ట్ సినిమాల గురించి మాట్లాడుకుందాం.
ఆకాశం నీ హద్దురా(2020):
కరోనా కారణంగా డిజిటల్ వేదికగా ఈ సినిమా రిలీజైంది కానీ థియేటర్లలో రిలీజ్ అయ్యుంటే ఈ సినిమా ఫలితం అద్భుతంగా ఉండేదని ప్రతీ సూర్య ఫ్యాన్ చెప్పుకుంటాడు.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటన పీక్స్‌లో ఉంటుంది.
Details
బోధి ధర్మను పరిచయం చేసిన సూర్య సినిమా
జై భీమ్(2021):
విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాలో సూర్య నటన వేరే లెవెల్లో ఉంటుంది. అట్టడుగు వర్గాలపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రూ పోరాడిన కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
సెవెన్త్ సెన్స్(2011):
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటి పదినిమిషాల్లో బోధిధర్మ పాత్రలో సూర్య కనిపిస్తారు. ఇండియా నుండి చైనా వలసవెళ్ళిన బోధి ధర్మ కథను ఈ సినిమాలో పరిచయం చేసారు.
సూర్య సన్నాఫ్ కృష్ణన్(2008):
గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో సూర్య కనిపిస్తారు. వయసు పైబడ్డ తండ్రి పాత్రలో సూర్య నటన అందరికీ నచ్చుతుంది. సమీరా రెడ్డి, సిమ్రాన్ ఇతర పాత్రల్లో కనిపించారు.
Details
గజినిలో సూర్య నటనకు సౌత్ ఇండియా ఫిదా
2005లో గజిని సినిమాతో సూర్య మార్కెట్ తమిళనాడును దాటి ఇతర రాష్టాలకు విస్తరించింది.
ఈ సినిమాలో 15నిమిషాలకు ఒకసారి గతాన్ని మర్చిపోయే పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడు.
ఈ సినిమాలోని ప్రేమకథకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలోని హృదయం ఎక్కడున్నదీ, ఒక మారు కలిసిన అందం పాటలు ఎంత హిట్టో చెప్పాల్సిన పనిలేదు.
మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా కనిపించింది.