Page Loader
Hari Hara Veera Mallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీం నుండి మ‌రో క్రేజీ అప్‌డేట్..!
హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీం నుండి మ‌రో క్రేజీ అప్‌డేట్..!

Hari Hara Veera Mallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీం నుండి మ‌రో క్రేజీ అప్‌డేట్..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ సినిమాలను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు,ఎట్టకేలకు జూన్ 12న 'హరిహర వీరమల్లు' విడుదల కానుందనే వార్తతో హర్షాతిరేకాలకు లోనవుతున్నారు. ఈ సినిమాను తెలుగు‌తో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషలలోనూ భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, చిత్రబృందం ప్రచార కార్యక్రమాలకు వేగం పెంచింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో పోస్టర్లు, వీడియోలు విడుదలయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే విడుదలైన "మాట వినాలి", "కొల్లగొట్టినదిరో", పవర్‌ఫుల్ "అసుర హననం" వంటి పాటలు భారీ స్థాయిలో ట్రెండ్ అవుతూ సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హీరోయిన్స్‌లో ఒకరైన నిధి అగర్వాల్ మీద చిత్రీకరించిన పాట విడుదలకు సమయం నిర్ణయించారు.

వివరాలు 

"తార తార" పాట విడుదల

మే 28వ తేదీన ఉదయం 10:20 గంటలకు "తార తార" అనే పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. "ది సిజ్లింగ్ సింగిల్... హరిహర వీరమల్లు నుంచి ఈ ఏడాది అత్యంత హాట్ ట్రాక్‌ను వినడానికి సిద్ధంగా ఉండండి" అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 'డాకు మహారాజ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన, ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. '

వివరాలు 

రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ 

హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ఇందులో ఆయన దొరలను దోచి పేదలకు న్యాయం చేసే రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. ఈ కారణంగా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్లు సౌత్, నార్త్ ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో నిర్వహించనున్న ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరుకానున్నారన్న వార్తలు ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాత చేసిన ట్వీట్