Page Loader
Hariharaveeraamllu : హరిహర వీరమల్లు పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ 
హరిహర వీరమల్లు పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌

Hariharaveeraamllu : హరిహర వీరమల్లు పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ 

వ్రాసిన వారు Stalin
Apr 17, 2024
07:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీరామనవమి (Sri Raama Navami) పండుగ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ (Pavan Kalyan) అభిమానులకు ట్రీట్‌ ఇస్తూ హరిహర వీరమల్లు పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు ఫిల్మ్‌ యూనిట్‌. పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ గా దర్శకుడు క్రిష్‌(Director Krish)రూపొందిస్తున్న 'హరిహర వీరమల్లు' పోస్టర్‌ లో మీ ముందుకు 'ధర్మం కోసం యుద్ధం' త్వరలో అనే క్యాప్షన్‌ ఇచ్చి పైన పవన్‌ కళ్యాణ్‌ ఇంటెన్స్‌ లుక్‌ తో ఉన్న కళ్లను మాత్రమే పెట్టారు. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఊగిపోతున్నారు. మొఘలు చక్రవర్తుల కాలంలో రాబిన్‌హుడ్‌ లాంటి పాత్రతో ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Details

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు 

ఈ సినిమా షూటింగ్‌ మూడేళ్ల క్రితమే మొదలైంది. అయితే కోవిడ్‌ అనంతర పరిణామాల నేపథ్యంలో పలుమార్లు షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. దీనికి తోడు పవన్‌ కళ్యాణ్‌ క్రియాశీలక రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతుండటంతో ఆయన షెడ్యూల్‌ తగ్గట్లుగా షూటింగ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ న టులు బాబీ డియోల్ (Bobby Deol), నిధి అగర్వాల్‌ (Nidhi Agarwal) కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్