
this week movies telugu: ఈ వారం థియేటర్‌లోకి 'హరి హర వీరమల్లు'.. ఓటీటీలోకి 'మండల మర్డర్స్'
ఈ వార్తాకథనం ఏంటి
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ యాక్షన్ మూవీ 'హరిహర వీరమల్లు' మళ్లీ అభిమానులకు పండుగను తీసుకొస్తోంది. క్రిష్, జ్యోతికృష్ణల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్‌ఇండియా మూవీని ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ధర్మ పరిరక్షణ కోసం ఓ యోధుడు చేసిన పోరాటం ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
Details
పురాణగాథ ఆధారంగా విజువల్ వండర్
హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన మరో భారీ చిత్రం 'మహావతార్: నరసింహ' కూడా జూలై 25న విడుదల కానుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హిరణ్యకశిపుని శిక్షించేందుకు విష్ణువు నరసింహ అవతారం ఎత్తిన నేపథ్యంలో కథ సాగనుంది. ప్రహ్లాదుడి కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం కోసం చిత్ర బృందం నాలుగేళ్లు కష్టపడ్డారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 2D, 3D వెర్షన్లలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Details
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన చిత్రాలు, సిరీస్‌లు
మండల మర్డర్స్ బాలీవుడ్ నటి వాణీ కపూర్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. శతాబ్దాల క్రితం చరణ్‌దాస్‌పూర్‌లో జరిగిన హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గోపి పుత్రన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మించింది. జూలై 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. సర్జమీన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ డ్రామాలో సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆర్మీ అధికారుల పోరాటం ప్రతిష్టాత్మకంగా చూపించనున్నారు. కాయోజ్ ఇరానీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జూలై 25 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Details
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం రిలీజ్ అయ్యే ప్రధాన కంటెంట్
జస్టిన్ ఆన్ ట్రయల్ (వెబ్ సిరీస్) - జూలై 21 టిన్ సోల్జర్* (ఇంగ్లీష్ మూవీ) - జూలై 23 రంగీన్ (వెబ్ సిరీస్) - జూలై 25 ఈ వారం థియేటర్లు, ఓటీటీలు అన్నీ కలిపి తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన కథాంశాల మీద ఆధారపడిన సినిమాలు, సిరీస్‌లను అందిస్తున్నాయి.