Page Loader
HariHara VeeraMallu : ఎట్టకేలకు.. హరిహర వీరమల్లు విడుదల తేదీ ఫిక్స్ 
ఎట్టకేలకు.. హరిహర వీరమల్లు విడుదల తేదీ ఫిక్స్

HariHara VeeraMallu : ఎట్టకేలకు.. హరిహర వీరమల్లు విడుదల తేదీ ఫిక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి,జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పీరియాడిక్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా కాలం క్రితమే సినిమా షూటింగ్ ముగించుకున్నఈ సినిమా విడుదల తేదీపై మరే ఇతర సినిమాలకు లేనటువంటి గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు దాదాపు 13 సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం,'హరిహర వీరమల్లు' చిత్రాన్ని జూలై 24న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్లు నిర్ణయించారు.

వివరాలు 

డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ 

మొదటగా ఈ చిత్రం మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, షూటింగ్ ఆలస్యమవడం, అలాగే థియేట్రికల్ హక్కుల అమ్మకం విషయంలో ఏర్పడిన జాప్యం కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక సినిమాను థియేటర్లలో విడుదల చేసే తేదీని కూడా ప్రైమ్‌మే నిర్ణయిస్తోంది.

వివరాలు 

జూలై 24న సినిమా విడుదల

మొదట జూలై మొదటి వారం రిలీజ్‌కు అనుకూలంగా భావించినా, షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఆగస్టు ఫస్ట్ వీక్ ను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే అమెజాన్ ప్రైమ్ ఆ తేదీకి ఓకే చెప్పకపోవడంతో, చివరికి జూలై 24న సినిమా విడుదలకు తుది నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేకసార్లు విడుదల వాయిదా పడటంతో, డిజిటల్ రైట్స్‌ విలువ కూడా తగ్గుతూ వస్తోంది. ఇంకొంచెం ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆలోచనతో నిర్మాత ఏ.ఎం. రత్నం ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా విడుదలకు సిద్ధమయ్యారు.