LOADING...
Coolie : శృతిహాసన్ డైలాగ్ వెనుక మిస్టరీ వీడిందా? 'కూలీ'లో కమల్ హాసన్ పాత్రపై ఆసక్తికర అప్డేట్!
శృతిహాసన్ డైలాగ్ వెనుక మిస్టరీ వీడిందా? 'కూలీ'లో కమల్ హాసన్ పాత్రపై ఆసక్తికర అప్డేట్!

Coolie : శృతిహాసన్ డైలాగ్ వెనుక మిస్టరీ వీడిందా? 'కూలీ'లో కమల్ హాసన్ పాత్రపై ఆసక్తికర అప్డేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'కూలీ' ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున, కన్నడ ఇండస్ట్రీ నుంచి రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ సాహిర్, తమిళం నుంచి సత్యరాజ్ లాంటి స్టార్లు భాగమవ్వగా, బాలీవుడ్ మెగాస్టార్ ఆమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. దేశంలోని నాలుగు ప్రధాన చిత్ర పరిశ్రమల టాప్ హీరోలు ఒక్కే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటంతో ఇది భారతదేశపు అత్యంత భారీ మల్టీస్టారర్ సినిమాగా రూపొందుతోంది. ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది.

Details

ట్రైలర్ పై మిశ్రమ స్పందన

ఈ వేడుకకు రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో 'కూలీ' ట్రైలర్‌ను విడుదల చేశారు. గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన ఈ ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇక ఈ సినిమాలో ఓ బంపర్ సర్ప్రైజ్ కూడా ఉందట. దర్శకుడు లోకేష్ అభిమాన నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తారని వార్తలొస్తున్నాయి. నిన్న విడుదలైన ట్రైలర్‌లో శృతిహాసన్ చెబుతున్న "అతను మీకు ఫ్రెండ్ మాత్రమే కానీ నాకు నాన్న" అనే డైలాగ్‌కు రజనీ "వాడు నా ప్రాణ స్నేహితుడు" అని స్పందిస్తాడు.

Details

ఆగస్టు 14న రిలీజ్

ఈ సంభాషణ 'కమల్ హాసన్ పాత్ర' గురించే అని టాక్. ఇంతకీ కమల్ హాసన్ ఇందులో ఎవరో కాదు, విక్రమ్ పాత్రలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తాడట. అంటే, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ముందుకు సాగనుందన్నమాట. రజనీకాంత్, కమల్ హాసన్ లు ఏకంగా ఒక్క ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్కంఠ చిగురిస్తోంది. స్టార్ కాస్టింగ్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, గెస్ట్ రోల్స్, లోకేష్ డైరెక్షన్, రజనీకాంత్ మాస్ ప్రెజెన్స్ - ఇవన్నీ కలసి 'కూలీ' సినిమాను ఆగస్టు 14న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.