
Allu Arjun: అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్.. తదుపరి విచారణను వచ్చే సోమవారం కి వాయిదా వేసిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్‌గా హాజరయ్యారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది.
కోర్టుకు స్వయంగా హాజరుకావాల్సిన అవసరం ఉండగా, అల్లు అర్జున్ న్యాయవాదులు ఆన్‌లైన్‌లో హాజరు కావడానికి అనుమతి కోరగా, న్యాయమూర్తి ఆమోదంతో ఆయన వర్చువల్‌గా హాజరయ్యారు.
వివరాలు
విచారణ జనవరి 10కి వాయిదా
ఈ కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ వివరాలను న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు.
అల్లు అర్జున్ కోర్టుకు వస్తారని సమాచారం రావడంతో ముందుగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది.
కౌంటర్ దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.
అదేవిధంగా, అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్‌పై విచారణ జనవరి 10కి వాయిదా పడింది.