
Hero Killed: అల్లరిమూకల విధ్వంసం.. హీరో, నిర్మాతను కొట్టి చంపిన ఆందోళన కారులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్నారు. రిజర్వేషన్ల వివాదం కాస్త ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేంత వరకు వెళ్లింది.
తాజాగా నిరసన కారులు జరిపిన దాడుల్లో బంగ్లా ప్రముఖ హీరోతో పాటు అతని తండ్రి చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
బంగ్లాతో సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత సలీం ఖాన్, అతని కుమారుడు షాంటో ఖాన్ ని హీరోగా పరిచయం చేశారు.
వీరద్దరిని ఆందోళన కారులు కొట్టి చంపేశారు.
Details
10 చిత్రాలకు నిర్మతగా వ్యవహరించిన సలీంఖన్
బలియా యూనివర్సిటీలోని ఫరక్కాబాద్ మార్కెట్లో తండ్రీకొడుకులపై ప్రజలు దాడి చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
తుపాకీతో బెదిరించి తప్పించుకున్న, బగారా మార్కెట్ సమీపంలో వీరిద్దరిని పట్టుకొని దారుణంగా కొట్టి చంపారు.
సలీం ఖాన్ 10 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించగా, బాబుజాన్, ఆంటో నగర్ వంటి సినిమాల్లో షాంటో ఖాన్ హీరోగా నటించారు.
సలీం, షాంటో ఖాన్ మృతిపై నటుడు దేవ్ స్పందించారు. ఈ ఘటనను నమ్మలేకపోతున్నానని, బంగ్లాదేశ్ లో తిరిగి శాంతియుత పరిస్థితులు రావాలని కోరుకున్నాడు.