Page Loader
Hi Nanna: భారీ ధరకు 'హాయ్ నాన్న' ఓటీటీ రైట్స్.. త్వరలోనే స్ట్రీమింగ్!
భారీ ధరకు 'హాయ్ నాన్న' ఓటీటీ రైట్స్.. త్వరలోనే స్ట్రీమింగ్!

Hi Nanna: భారీ ధరకు 'హాయ్ నాన్న' ఓటీటీ రైట్స్.. త్వరలోనే స్ట్రీమింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2023
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు 'హాయ్ నాన్న'(Hi Nanna) సినిమాతో ముందుకొచ్చాడు. కొత్త డైరక్టర్స్ తో నటించడానికి ముందుండే నాని, మరోసారి శౌర్యుత్ అనే దర్శకుడిని హాయ్ నాన్న సినిమాతో పరిచయం చేశాడు. రిలీజ్ కు ముందే నాని-మృణాల్ ఠాకూర్(Nani-Mrinal Thakur) జోడీ ప్రోమోలు ఆకట్టుకున్నాయి. మొదటి షోకే యావరాజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని #Netflix సొంతం చేసుకుంది. హాయ్ నాన్న మూవీని వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Details

రూ.37 కోట్లకు దక్కించుకున్న నెట్ ప్లిక్స్

తెలుగుతో పాటు అన్ని సౌత్ భాషలకు కలిపి ఈ మూవీని రూ.37 కోట్లకు నెట్ ప్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నాని సినిమాకు ఈ రేంజ్ లో ఓటిటి రేట్స్ రావడం ఇదే మొదటిసారి ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ని ప్రముఖ టెలివిజన్ సంస్థ జెమినీ టీవీ దక్కించుకుంది. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా మొత్తం తండ్రీ కూతుర్ల బంధాన్ని చూపిస్తుంది. నాని యాక్టింగ్ ఈ సినిమాకు అదనపు అకర్షణగా నిలిచాయి.