
NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'వార్ 2'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ 'వార్' సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది.
మళ్లీ 'రా ఏజెంట్ కబీర్ ధాలివాల్' పాత్రలో హృతిక్ మెరవనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ పాత్రలో కీలకంగా కనిపించనున్నట్లు సమాచారం.
ఇప్పుడీ చిత్రంపై మళ్లీ క్రేజీ హైప్ తెచ్చేలా ఓ బిగ్ అప్డేట్ రాబోతుంది. ఈ నెల మే 20న ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీ నుంచి సాలిడ్ ట్రీట్ అభిమానుల కోసం సిద్ధంగా ఉంది.
Details
ట్విట్టర్ వేదికగా హృతిక్ రోషన్
ఈ విషయాన్ని హృతిక్ రోషన్ స్వయంగా 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. 'తారక్... మే 20న ఏమి జరగబోతుందో నీవు ఊహించలేవు. నన్ను నమ్ము... చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది.
వార్ 2 కోసం సిద్ధంగా ఉండు' అంటూ హృతిక్ పోస్ట్ చేశారు. దీంతో 'వార్ 2' టీజర్ మే 20న రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక బాలీవుడ్ ట్రెండ్స్‌కు భిన్నంగా యష్ రాజ్ ఫిల్మ్స్ ఎన్టీఆర్ పుట్టినరోజును ఈసారి ప్రత్యేకంగా పరిగణిస్తోంది. దీనికి కారణం 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ హిందీ మార్కెట్లో సైతం భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడమే.
Details
ఆగస్టు 14న మూవీ రిలీజ్
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ కూడా రావొచ్చన్న వార్తలున్నాయి.
అదేంటంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తున్న తదుపరి చిత్రం (వర్కింగ్ టైటిల్ 'డ్రాగన్') నుంచి కూడా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టైటిల్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.
దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.