Loading...
Salman Khan: ఇప్పుడైతే సిక్స్‌ప్యాక్‌ లేదు.. రెండు నెలల్లో ఫిట్‌నెస్‌ సాధిస్తా: సల్మాన్‌ ఖాన్
ఇప్పుడైతే సిక్స్‌ప్యాక్‌ లేదు.. రెండు నెలల్లో ఫిట్‌నెస్‌ సాధిస్తా: సల్మాన్‌ ఖాన్

Salman Khan: ఇప్పుడైతే సిక్స్‌ప్యాక్‌ లేదు.. రెండు నెలల్లో ఫిట్‌నెస్‌ సాధిస్తా: సల్మాన్‌ ఖాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల 'బిగ్‌బాస్‌' ఎపిసోడ్‌లో ఆయన చొక్కా విప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సల్మాన్ స్పందించారు. తన శరీరం ప్రస్తుతం సిక్స్‌ప్యాక్‌లో లేదని, 'వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌' దశలో ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. 'ప్రస్తుతం నా బాడీ సిక్స్‌ప్యాక్‌తో లేదు. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ లేని నా శరీరాన్ని చూపించడానికే అలా చొక్కా విప్పా. నా బాడీ ఇప్పుడు 'వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌' దశలో ఉంది. నేను కోరుకున్న ఫిట్‌నెస్ సాధించడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుంది'' అని సల్మాన్ ఖాన్ చెప్పారు.

వివరాలు

కథానాయికగా నయనతార

తన తదుపరి పాన్ ఇండియా చిత్రం కోసమే సల్మాన్ ఖాన్ ఈ మేకోవర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన 'మాన్‌స్టర్' (Monster) అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.

దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నయనతార కథానాయికగా నటించనున్నారు. 2027 రంజాన్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు, ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై సల్మాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వివరాలు

డీప్‌ఫేక్ వీడియోలపై సల్మాన్ ఆగ్రహం

సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తున్న వారిని వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. 'బిగ్‌బాస్-20' (Bigg Boss 20) వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తీరు భయానకంగా ఉందని సల్మాన్ అభిప్రాయపడ్డారు. 'ఇలాంటి ఏఐ వీడియోల బారిన నేనూ పడ్డాను.

వాస్తవాలు తెలియని వారు ఆ వీడియోలు చూసి నిజమే అనుకుంటారు. ఒకరిద్దరిని జైల్లో పెడితే కానీ.. ఇలాంటి దారుణాలు ఆగవు. సోషల్ మీడియాను నియంత్రించేందుకు కచ్చితంగా సెన్సార్‌షిప్, కఠిన చట్టాలు తీసుకురావాలి'' అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.

ఇప్పటికే రష్మిక, కత్రినా కైఫ్, రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ తదితర పలువురు సినీ ప్రముఖులు డీప్‌ఫేక్ వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT