Page Loader
Idly Kadai: అక్టోబర్‌లో విడుదల కానున్న ధ‌నుష్ 'ఇడ్లీ కడై' 
అక్టోబర్‌లో విడుదల కానున్న ధ‌నుష్ 'ఇడ్లీ కడై'

Idly Kadai: అక్టోబర్‌లో విడుదల కానున్న ధ‌నుష్ 'ఇడ్లీ కడై' 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ నటుడు ధనుష్‌ 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్', 'జాబిలమ్మ నీకు అంత కోపమా' వంటి చిత్రాలతో సూపర్‌హిట్‌లు అందుకున్నారు. అయితే, ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'ఇడ్లీ కడై' (ఇడ్లీ కొట్టు). ఈ సినిమాలో ధనుష్‌ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు, దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, నిత్యమీనన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే, అరుణ్ విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం, విడుదల తేదీని అక్టోబర్ 1కి మార్చారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

వివరాలు 

కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు

ఇక ధనుష్‌ ప్రస్తుతం 'ఇడ్లీ కడై'తో పాటు, ఇళయరాజా బయోపిక్‌, శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'కుబేరా' చిత్రాల్లో నటిస్తున్నారు. తిరుచిత్రబలం సినిమా తర్వాత నిత్యమీనన్‌, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సత్యరాజ్‌, అశోక్ సెల్వన్‌, రాజ్‌కిరణ్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనే అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ధనుష్‌  చేసిన ట్వీట్