NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Year Ender 2024: 2024లో అత్యంత పాపులర్ మూవీస్ ఇవే.. జాబితా విడుదల చేసిన IMDb
    తదుపరి వార్తా కథనం
    Year Ender 2024: 2024లో అత్యంత పాపులర్ మూవీస్ ఇవే.. జాబితా విడుదల చేసిన IMDb
    2024లో అత్యంత పాపులర్ మూవీస్ ఇవే.. జాబితా విడుదల చేసిన IMDb

    Year Ender 2024: 2024లో అత్యంత పాపులర్ మూవీస్ ఇవే.. జాబితా విడుదల చేసిన IMDb

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 12, 2024
    02:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది అత్యంత పాపులర్ అయిన సినిమాలు ఏంటో తెలుసా.. భారీ బడ్జెట్,పాన్ ఇండియా చిత్రాలే కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి కూడా జనాలు ఎక్కువ ఆసక్తి చూపించారు.

    ఐడీఎంబీ ఈ ఏడాది అత్యంత పాపులర్ అయిన సినిమాల జాబితాను విడుదల చేసింది.

    ఇందులో "కల్కి","స్త్రీ" చిత్రాలు టాప్ ప్లేస్ లో నిలిచాయి. అనంతరం"మహారాజా", "మంజుమ్మెల్ బాయ్స్" వంటి చిత్రాలతో పాటు మరికొన్ని పాన్ ఇండియా మూవీస్, ప్రాంతీయ సినిమాలు, విమర్శకుల ప్రశంసలు పొందిన చిన్న సినిమాలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించాయి.

    తెలుగు,హిందీ,తమిళ,మలయాళ భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలు కూడా ఈ జాబితాలో ప్రదర్శించబడ్డాయి.

    2024లో ప్రేక్షకులు ఎక్కువగా అభిమానించి ఆసక్తి చూపిన సినిమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

    వివరాలు 

    2024లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాలు: 

    కల్కి 2898 AD

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం "కల్కి 2898 AD". నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కొత్త రికార్డులు సృష్టించింది.

    స్త్రీ 2

    బాలీవుడ్ స్టార్స్ రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన "స్త్రీ 2" హారర్ కామెడీ చలనచిత్రం, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. పుష్ప 2 తర్వాత, ఈ సినిమా 2024లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం‌గా నిలిచింది.

    వివరాలు 

    2024లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాలు: 

    మహారాజా

    కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన "మహారాజా", ఈ ఏడాది అత్యంత విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రంగా నిలిచింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ ముఖ్యపాత్రలు పోషించారు.

    షైతాన్

    బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆర్. మాధవన్, జ్యోతిక నటించిన "షైతాన్" ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను తన కధనంతో కట్టిపడేసింది.

    వివరాలు 

    2024లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాలు: 

    ఫైటర్

    బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన "ఫైటర్", దేశభక్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు.ఈ చిత్రం 2019లో జరిగిన పుల్వామా దాడి మరియు బాలాకోట్ వైమానిక దాడులను ఆధారంగా తీసుకుంది.

    మంజుమ్మెల్ బాయ్స్

    చిదంబరం దర్శకత్వం వహించిన "మంజుమ్మెల్ బాయ్స్"సినిమా కొడైకెనాల్‌లో విహారయాత్ర చేస్తున్న స్నేహితుల కథను ప్రస్తావిస్తుంది. ఉత్కంఠ మరియు కామెడీతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానం పొందింది.

    భూల్ భులయ్యా 3

    భూల్ భులయ్యా 3, కార్తీక్ ఆర్యన్ నటించిన హారర్ కామెడీ సీక్వెల్, బీటౌన్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందింది. ఇందులో విద్యాబాలన్,మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ కీలక పాత్రల్లో నటించారు.

    వివరాలు 

    2024లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాలు: 

    కిల్

    కరణ్ జోహార్ నిర్మించిన"కిల్",నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్.లక్ష్య, రాఘవ్ జుయాల్,ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ప్రేక్షకులకి ఉత్కంఠభరిత అనుభవం ఇచ్చింది.

    సింగం ఎగైన్

    రోహిత్ శెట్టి దర్శకత్వంలో "సింగం ఎగైన్"విడుదలైంది.దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.అజయ్ దేవగణ్,అక్షయ్ కుమార్,రణవీర్ సింగ్,టైగర్ ష్రాఫ్,దీపికా పదుకొనే, కరీనా కపూర్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.

    లాపటా లేడీస్

    అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన"లాపటా లేడీస్"97వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద మంచి ప్రశంసలు అందుకున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సంవత్సరం ముగింపు 2024

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    సంవత్సరం ముగింపు 2024

    Year Ender 2024: ఈ సంవత్సరం భారతదేశాన్ని వణికించిన వ్యాధులు ఇవే..! టెక్నాలజీ
    Year Ender 2024: 2024లో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ప్రముఖ క్రికెటర్లు వీళ్లే! క్రీడలు
    Year Ender 2024: 2024లో పెళ్లి చేసుకున్న 10 సినిమా సెలబ్రిటీ జంటలు వీళ్లే..? సినిమా
    Year ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025