Prabhas: అజయ్ దేవగన్ మూవీలో ప్రభాస్.. 'కల్కి' పాటతో హింట్ ఇచ్చిన దర్శకుడు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్స్ ఈ మధ్య బాలీవుడ్ లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్ 2' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ కూడా బాలీవుడ్‌లో నటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అజయ్ దేవగణ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'సింగమ్ అగైన్' చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఈ విషయానికి సంబంధించి, రోహిత్ శెట్టి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు.
ఈ హీరో లేకపోతే ఈ చిత్రం అసంపూర్తిగా ఉంటుందని, దీపావళికి ఈ స్కార్పియోలోని నటుడు సందడి చేయనున్నాడని, కానీ ఇక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉందని పేర్కొన్నారు.
Details
దీపావళికి కానుకగా రిలీజ్
పోస్ట్‌లో స్కార్పియో కారు వచ్చే వీడియోను మాత్రమే షేర్ చేశారు.
కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 'కల్కి'లోని బుజ్జి థీమ్ సాంగ్ ఉండడం విశేషం. దీంతో అభిమానులు బాలీవుడ్ లోనూ ప్రభాస్ సందడి చేయనున్నాడని సంబరపడుతున్నారు.
మరోవైపు, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ సూర్య కూడా కనిపించనున్నాడనే ఊహాగానాలు ఉన్నాయి.
'సింగం' సిరీస్‌లో సూర్య పాత్రలు ఎంత పెద్ద హిట్లు అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన ఈ చిత్రంలో భాగమయ్యారని తెలిసింది.
'సింగమ్ అగైన్' చిత్రంలో అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె వంటి ప్రముఖ నటులు కూడా కనిపించనున్నారు.
దీపావళికి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.