Page Loader
ఇండియా గర్వంతో ఉప్పొంగిపోతోంది : ప్రధాని మోదీ

ఇండియా గర్వంతో ఉప్పొంగిపోతోంది : ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 13, 2023
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. భారతీయ సినీ ప్రపంచం గర్వించేలా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లో ఘనంగా జరుగుతున్న ఆస్కార్స్ వేదికపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ రావడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వపడే క్షణం రావడంతో సంతోషిస్తున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' ద్వారా ఇండియాకు మరో ఆస్కార్ అవార్డు దక్కింది.

ప్రధాని మోదీ

ఆస్కార్ రావడంపై ప్రధాని మోదీ హర్షం

నాటు నాటు సాంగ్ కి అస్కార్ రావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాట కొన్నేళ్లపాటు గుర్తుండిపోతుందని, కీరవాణి, చంద్రబోస్‌తో పాటు మొత్తం మూవీ టీంకి అభినందనలు అని, ఇప్పుడు ఇండియా గర్వంతో ఉప్పొంగిపోతోందని ప్రధాని మోదీ ట్విట్ చేశారు. అంతర్జాయతీ వేదికపై ప్రతిష్టాత్మకమైన అవార్డను సొంతం చేసుకోవడంతో ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. ఆస్కార్ అవార్డు దక్కిన ఆనందంలో ఎంఎం కీరవాణి మాటలు మరిచి పాటరూపంలో తన సంతోషాన్ని వ్యక్త పరిచారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

RRR టీంకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ