Page Loader
Cinema Release: గేమ్ చేంజర్, ఇండియన్ 2 విడుదల సస్పెన్స్​ కు తెరదించిన శంకర్

Cinema Release: గేమ్ చేంజర్, ఇండియన్ 2 విడుదల సస్పెన్స్​ కు తెరదించిన శంకర్

వ్రాసిన వారు Stalin
Apr 06, 2024
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

జెంటిల్మన్, ప్రేమికుడు, భారతీయుడు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందించిన దర్శకుడు శంకర్ తాజాగా మెగా అభిమానులకు, కమల్ హాసన్ అభిమానులకు మంచి అప్ డేట్ ఇచ్చారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్, కమల్ హాసన్ కథానాయకుడిగా రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఇండియన్ -‌2 సినిమాల రిలీజ్ డేట్లను శంకర్ ఫైనల్ చేశారు. ఇండియన్ సినిమా జూన్ 13 న, గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్ తొలి వారంలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వాస్తవానికి ఈ రెండు సినిమాల విడుదలపై ఎప్పట్నుంచో చిత్రపరిశ్రమలో డైలమా ఉంది. ఆ సందిగ్థతకు శంకర్ తెరదించారు. దీంతో మెగాభిమానులు, కమల్ హాసన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Cineme Relaese

దసరా సీజన్ లో కలెక్షన్ల సునామీ?

అక్టోబర్ తొలివారం అంటే దసరా సెలవులు ఉండే నేపథ్యంలో ఆ సమయంలో సినిమాను రిలీజ్​ చేస్తే కలెక్షన్ల సునామీ వెల్లువెత్తుతుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇండియన్ 2 ‌‌-సేనాపతి ఈజ్ బ్యాక్ అంటూ వస్తున్న సినిమా జూన్ 13న విడుదల అంటే డ్రై సీజన్​ గానే లెక్క. ఆ సమయంలో స్కూల్స్​, కాలేజీలు తెరచుకుంటాయి గనుక కలెక్షన్లపై అంచనా ఉండదు. ఆ సీజన్ కు వర్షాలు కూడా తోడవుతాయి. అయితే ఇండియన్ 2 సినిమా డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసేసింది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్ధ్, సముద్రఖని, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.

Game Changer

అనిరుధ్​ రవిచందర్​ మ్యాజిక్​ మ్యూజిక్​ 

ఇక పొలిటికల్ థ్రిల్లర్ జోనర్గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలీ, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.