Loading...
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. 'ఇరుముడి' ట్రైలర్ రిలీజ్ అక్కడే!
భీమవరంలో రవితేజ హంగామా.. 'ఇరుముడి' ట్రైలర్ రిలీజ్ అక్కడే!

Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. 'ఇరుముడి' ట్రైలర్ రిలీజ్ అక్కడే!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ అభిమానులకు 'ఇరుముడి' చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఇరుముడి' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12న ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా నిర్వహించనున్న భారీ లాంచ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

సినిమాపై మరింత ఆసక్తి..

కుటుంబం కోసం ఓ వ్యక్తి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడే కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ విడుదల చేసిన ట్యాగ్‌లైన్‌ను బట్టి తెలుస్తోంది.

"When family means everything, a man will do anything for them" అనే లైన్‌తో తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి కుమార్, బేబీ నక్షత్ర, విష్ణు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

వివరాలు

ఆగస్టు 21న విడుదల..

'ఇరుముడి' సినిమాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఇతర ప్రచార కార్యక్రమాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

తాజాగా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో రవితేజ అభిమానుల్లో మరింత జోష్ నెలకొంది.

మరి ఆగస్టు 12న భీమవరంలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో 'ఇరుముడి' ట్రైలర్ ఎలాంటి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుందో చూడాలి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

ADVERTISEMENT