Page Loader
Jaat: 'జాట్ 2' ప్రకటించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ 
'జాట్ 2' ప్రకటించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్

Jaat: 'జాట్ 2' ప్రకటించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, 'గద్దర్ - 2' సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, టాలీవుడ్‌కి చెందిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పూర్తిగా కమర్షియల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం పేరు 'జాట్'. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మించాయి.

వివరాలు 

 మాస్ ప్రేక్షకులను నటనతో అక్కటుకున్న సన్నీ డియోల్

ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'జాట్' చిత్రం మంచి స్పందన తెచ్చుకుంది. సన్నీ డియోల్ మాస్ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు గోపీచంద్ మలినేనికి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. సీనియర్ హీరో అయిన సన్నీ డియోల్‌ను ఎంతో సమర్థవంతంగా హ్యాండిల్ చేశాడని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే, కథ విషయానికి వస్తే ఇది సాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించే రొటీన్ ఫార్మాట్‌తో ఉందని, హీరో-విలన్ పాత్రలు మాత్రమే బాలీవుడ్‌ నుంచి తీసుకున్నట్టు కొంతమంది విమర్శించారు.

వివరాలు 

 ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం 

ఈ విమర్శలను పక్కన పెడితే, కమర్షియల్ దృష్టికోణంలో 'జాట్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా 'జాట్' సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. 'జాట్ 2' పేరుతో సీక్వెల్ రూపొందించనున్నట్లు అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి కూడా గోపీచంద్ మలినేనే దర్శకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్