
Jabardasth : గప్'చుప్'గా జబర్దస్త్ కిరాక్ ఆర్పీ పెళ్లి.. దీనిపై ఆర్పీ ఏమన్నారంటే
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ 'జబర్దస్త్ షో' కామెడీ ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న కిరాక్ ఆర్పీ పెళ్లి మాత్రం హడావిడీ లేకుండానే కానిచ్చేశారు.
కనీసం సినీ సెలబ్రిటీలను కూడా పిలవకుండా వివాహాన్ని నిరాడంబరంగా జరిపించేశారు. కిరాక్ ఆర్‌పీ, లక్ష్మీ ప్రసన్న జంట, గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అయితే గతేడాది మేలోనే వీరి నిశ్చితార్థం జరిగింది. కానీ ఇన్నాళ్లకు ఈ ప్రేమికులు పెళ్లి పీటలెక్కారు. ఇదే సమయంలో పెళ్లి సింపుల్‌గా జరిగిపోవడంపై ఆర్‌పీ వివరణ ఇచ్చుకున్నాడు.
తన భార్యది విశాఖపట్నం అని, గతేడాదే నిశ్చితార్థం జరిగిందన్నారు. తాము ఇద్దరం ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నామని వెల్లడించాడు.
ఎంగేజ్‌మెంట్ సహా ఇతర వేడుకలకు సెలబ్రిటీలు హాజరయ్యారని, కానీ పెళ్లి మాత్రం సింపుల్‌గానే చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నామన్నారు.
DETAILS
ఏడాదిన్నర తర్వాత పెళ్లి.. కానీ కారణం మాత్రం చెప్పలేదు
అందువల్లే బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి జరిపించాలని అత్తగారు ఊరు వైజాగ్‌ను ఎంచుకున్నామన్నారు.
మరోవైపు ఎంగేజ్‌మెంట్ పెళ్లికి మధ్య ఏర్పడిన భారీ గ్యాప్'పై మాత్రం ఈ జబర్దస్త్ ఏడాదిన్నర తర్వాత పెళ్లి చేసుకునేందుకు కారణం మాత్రం ఆర్‌పీ చెప్పలేదు.
జబర్దస్త్‌లో కామెడియన్‌గా పని చేస్తున్న సమయంలోనే లక్ష్మి ప్రసన్నతో పరిచయం ఏర్పడింది. అనంతరం అది కాస్త ప్రేమకు దారి తీసింది.
ఇక ఆర్పీ పెళ్లి జరిగిన సంగతి తెలుసుకున్న జబర్దస్త్ ప్రేక్షకులు శుభాకాంక్షలు వెల్లువను పారిస్తున్నారు.
కామెడియన్ నుంచి బిజినెస్‌మ్యాన్‌గా బజర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా కుదిరిన రీతిలో స్థిరపడ్డారు.