Page Loader
Sudigaali Sudheer : రష్మితో సినిమాకు కథలు వింటున్నామన్న సుడిగాలి సుధీర్‌.. కానీ
Sudigaali Sudheer : రష్మితో సినిమాకు కథలు వింటున్నామన్న సుడిగాలి సుధీర్‌.. కానీ

Sudigaali Sudheer : రష్మితో సినిమాకు కథలు వింటున్నామన్న సుడిగాలి సుధీర్‌.. కానీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 22, 2023
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

జబర్దస్త్ షో ఫేమ్, బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ కొత్త సినిమాపై స్పందించారు. తాను రష్మి కలిసి చాలా కథలు విన్నామన్నారు. కానీ అవేవీ తమ ఇద్దరికీ నచ్చలేదన్నారు. అయితే ఇద్దరికీ నచ్చే కథ దొరికితే తప్పకుండా కలిసి సినిమా తీస్తామని చెప్పుకొచ్చారు. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. 'జబర్దస్త్' షో ద్వారా లక్షలాది మందిని అలరిస్తూ టాలీవుడ్ హిరోగా మారారు. అదిరిపోయే స్కిట్స్, పంచ్ డైలాగులతో పడి పడి నవ్వేలా చేయడం సుధీర్ స్టైల్. మొదట్లో కమెడియన్ పాత్రలు షోషించినా క్రమంగా హీరో స్థాయికి ఎదిగిపోయాడు. మరో విషయం ఏంటంటే రష్మీ, సుధీర్ కలిసి తెర మీద కనిపిస్తే చాలు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉంటారు.

Details

నమ్ముకున్న నిర్మాతకు లాభాలు రావాలి అంతే : సుడిగాలి సుధీర్

ఇప్పటికే రష్మి హీరోయిన్ పాత్రల్లో పలు సినిమాలకు ఒకే చెప్పేసింది. ఆశించిన మేరకు రాణించలేకపోయినా, అడపాదడపా సినిమాలు చేస్తోంది. 'కాలింగ్‌ సహస్ర' సినిమా గురించి సుడిగాలి సుధీర్ స్పందించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌' కోణంలో వస్తున్న సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది తన మూడో సినిమా అని, ప్రస్తుత కాలంలో హిట్‌ కావాలంటే కంటెంట్ ప్రధాన ఆధారమన్నారు. కథలో బలం ఉంటే కచ్చితంగా విజయం వచ్చి తిరుతుందన్నారు. అయితే ఈ సినిమా కూడా మంచి కంటెంట్'తో ప్రేక్షకుల ముందుకు వస్తోందని, మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చూడాలనుకునే వారికి ఈ సినిమా చక్కగా నచ్చుతుందన్నారు. మరోవైపు తనకు పెద్ద కోరికలు ఏమీ లేవన్న సుధీర్, తన నిర్మాతలకు లాభాలు వస్తే చాలన్నారు.