Loading...
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' రూ.2,000 కోట్ల మార్క్ అందుకుంటుందా?
జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' రూ.2,000 కోట్ల మార్క్ అందుకుంటుందా?

SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' రూ.2,000 కోట్ల మార్క్ అందుకుంటుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొంటాయి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన చిత్రాల వసూళ్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ 'వారణాసి'పై కూడా ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

వివరాలు

రూ.22 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో మొదలై..

రాజమౌళి దర్శకత్వంలో 2001లో వచ్చిన 'స్టూడెంట్ నంబర్ 1' సినిమా సుమారు రూ.22 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించింది.

ఆ తర్వాత వచ్చిన 'సింహాద్రి' రూ.46 కోట్లు, 'సై' రూ.18 కోట్లు, 'ఛత్రపతి' రూ.36 కోట్లు, 'విక్రమార్కుడు' రూ.36 కోట్లు, 'యమదొంగ' రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు గణాంకాలు ఉన్నాయి.

ఇక రాజమౌళి కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచిన 'మగధీర' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టింది.

అనంతరం వచ్చిన 'మర్యాద రామన్న' రూ.40 కోట్లు, 'ఈగ' సుమారు రూ.130 కోట్ల వరకు వసూళ్లు సాధించాయి.

వివరాలు

'బాహుబలి'తో మారిన జక్కన్న లెక్కలు

అయితే 'బాహుబలి' సినిమాతో రాజమౌళి చిత్రాల బాక్సాఫీస్ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. 2015లో విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' సుమారు రూ.650 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించింది.

ఆ తర్వాత 2017లో వచ్చిన 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' ఏకంగా రూ.1,810 కోట్ల గ్రాస్‌తో భారీ రికార్డును సృష్టించింది.

ఇక రాజమౌళి దర్శకత్వంలో ఆ తర్వాత వచ్చిన 'ఆర్ఆర్ఆర్' కూడా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,316 కోట్ల గ్రాస్ సాధించినట్లు లెక్కలు ఉన్నాయి. దీంతో రాజమౌళి తదుపరి చిత్రం 'వారణాసి'పై కూడా బాక్సాఫీస్ అంచనాలు భారీగా పెరిగాయి.

ADVERTISEMENT

వివరాలు

'వారణాసి'పై రూ.2,000 కోట్లకు పైగా అంచనాలు

ప్రస్తుతం 'సూపర్ స్టార్' మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి'పై రూ.2,000 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ అంచనాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీగా విడుదల కానుండటంతో ఈ స్థాయి వసూళ్లు సాధ్యమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి టేకింగ్‌తో పాటు మహేశ్ బాబు స్టార్‌డమ్ కూడా ఈ సినిమాకు కలిసిరానుందని అంచనాలున్నాయి.

ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో రూ.2,000 కోట్ల మార్క్‌ను దాటిన ఏకైక చిత్రం 'దంగల్'గా పేర్కొంటున్నారు.

2027 ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ADVERTISEMENT