Page Loader
Jani Master: చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల.. 
చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల..

Jani Master: చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2024
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే బెయిల్ పొంది చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేయడంతో, ఆయన ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చారు. జానీ మాస్టర్ తన వద్ద పనిచేసే మైనర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

వివరాలు 

జైలులో గడిపిన జీవితం నాకు చాలా పాఠాలను నేర్పించింది: జానీ 

డ్యాన్సర్ ఒకరు సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ,"అవకాశాల పేరుతో తనను బెదిరించి జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు" అని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు గత నెల 19న జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత,ఆయనను చంచల్‌గూడ జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్,"జైలులో గడిపిన జీవితం నాకు చాలా పాఠాలను నేర్పించింది" అని పేర్కొన్నారు. ఈ సంఘటనలో జానీ మాస్టర్ భార్య పేరు కూడా బాధితురాలికి అందించిన ఫిర్యాదులో ప్రస్తావించబడింది. 2019లో మైనర్‌గా ఉన్నప్పుడు,జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని బాధితురాలి వాంగ్మూలంలో తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్‌ జైలు నుంచి విడుదల