
KA Movie: 'క' సినిమా ఖాతాలో మరో అవార్డు.. 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో ఉత్తమ చిత్రంగా అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన 'క' చిత్రం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.
ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్(Dada Saheb Phalke Film Festival) లో ఈ సినిమాకు ఉత్తమ చిత్ర అవార్డు లభించింది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని నెటిజన్లు చిత్రబృందానికి అభినందనలు తెలుపుతున్నారు.
ఈ సినిమాను నూతన దర్శకులైన సుజిత్,సందీప్ సంయుక్తంగా తెరకెక్కించారు.
కథానాయికలుగా నయన్ సారిక,తన్వీ రామ్ నటించారు.గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రం, విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని,కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన హిట్గా నిలిచింది.
అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమాను ఫాంటసీ థ్రిల్లర్ శైలిలో రూపొందించారు.
వివరాలు
'క 2' ఉంటుందని ప్రకటించిన టీం
డాల్బీ విజన్: ఆటమ్స్ టెక్నాలజీలతో తెరకెక్కించారు.'అభినయ్ వాసుదేవ్' అనాథ.
ఇతరుల ఉత్తరాలు చదువుతూ, అవి తన కుటుంబ సభ్యులదే అనుకుంటూ జీవితాన్ని గడిపే వ్యక్తిగా చూపించారు.
ఒకరోజు అతను చదివిన ఉత్తరం ద్వారా తన ఊరిలో అదృశ్యమవుతున్న యువతుల గురించి కీలకమైన విషయం బయటపడుతుంది.
ఆ తర్వాత అభినయ్ జీవితంలో ఏం జరిగింది? ఎలాంటి మలుపులు వచ్చాయి? అనే అంశాల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది.
ఈ సినిమాకు తదుపరి భాగం 'క 2' కూడా ఉంటుందని ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
తొలి భాగానికి కొనసాగింపుగా వచ్చే ఈ సీక్వెల్ మరింత ఉత్కంఠ భరితంగా ఉండబోతుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తామని సినిమా యూనిట్ హామీ ఇచ్చింది.