Thug Life: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' నుంచి తొలి తెలుగు సింగిల్ 'జింగుచా' వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్' ప్రియులలో భారీ అంచనాలు సృష్టిస్తోంది.
ఈ కాంబినేషన్ గతంలో 1987లో వచ్చిన క్లాసిక్ హిట్ 'నాయగన్' (తెలుగులో నాయకుడు) చిత్రంలో ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే.
దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత ఈ ద్వయం మళ్లీ స్క్రీన్‌పై కలవడం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ చిత్రంలో కమల్ హాసన్ 'రంగరాయ శక్తివేల్ నాయకర్' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. త్రిష కథానాయికగా నటిస్తుండగా శింబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Details
అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తి
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2025 జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది.
టీజర్ ఇప్పటికే విడుదల కాగా, తాజాగా తెలుగు ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు.
'జింగుచా' అనే పాట పేరుతో వచ్చిన ఈ లిరికల్ సాంగ్‌కు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన మాయాజాలాన్ని మళ్లీ ప్రేక్షకులకు వినిపించేలా స్వరపరిచారు.
ఈ భారీ బడ్జెట్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతుండగా, రిలీజ్‌కు ముందే ప్రమోషన్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఇంకా ప్రచారంలో భాగంగా విడుదలయ్యే ఇతర అప్డేట్స్ కోసం ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్నారు