LOADING...
Thug Life: అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్'.. Rs.14 కోట్ల కలెక్షన్లతో రికార్డు  
అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్'.. Rs.14 కోట్ల కలెక్షన్లతో రికార్డు

Thug Life: అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్మురేపిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్'.. Rs.14 కోట్ల కలెక్షన్లతో రికార్డు  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

38 ఏళ్ల విరామం తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేసిన సినిమా 'థగ్ లైఫ్' ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో విజిల్స్ మోగిస్తూ, పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. మణిరత్నం ప్రత్యేకమైన టేకింగ్, కమల్ హాసన్ మాస్ ప్రెజెన్స్ కలిసి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. జూన్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపింది.

వివరాలు 

తమిళనాటే రూ.5.3 కోట్లు వసూలు 

తమిళ భాషలో మాతృకగా రూపొందిన ఈ చిత్రం, తెలుగుతో పాటు హిందీ భాషల్లోనూ అనువాదమైంది. తమిళంలో విడుదలైన మొదటి రోజే ఈ సినిమా రూ.5.3 కోట్ల విలువైన అడ్వాన్స్ బుకింగ్స్‌ను సాధించింది. ఇందులో 2డీ వర్షన్ మాత్రమే రూ.5.25 కోట్ల వసూళ్లు రాగా, ఐమాక్స్ 2డీ ద్వారా రూ.11.63 లక్షలు, 4డీఎక్స్ ద్వారా రూ.70,470 రాబట్టింది. తెలుగులో ఎంత వచ్చిందంటే..? సినిమా ట్రాకింగ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం,తెలుగులో 'థగ్ లైఫ్' అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.54 లక్షలు వసూలు చేసింది. హిందీ వెర్షన్‌ మాత్రం రూ.26లక్షల వసూళ్లకు పరిమితమైంది.మొత్తంగా అన్ని భాషల్లో కలిపితే,ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా రూ.6.16 కోట్లను సంపాదించింది.

వివరాలు 

గత రికార్డుల్ని చెరిపేసిన 'థగ్ లైఫ్' 

ఇప్పటి వరకు వచ్చిన మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్‌ చూస్తే అది రూ.13.89 కోట్లను దాటి పోయింది. మణిరత్నం గత చిత్రమైన 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2'తో పోలిస్తే, 'థగ్ లైఫ్' అడ్వాన్స్ బుకింగ్స్‌లో మెరుగైన ఫలితాన్ని నమోదు చేసింది. అప్పట్లో 'పొన్నియన్ సెల్వన్ 2'కి రూ.11 కోట్ల అడ్వాన్స్ వసూళ్లు వచ్చాయి. వాటిని 'థగ్ లైఫ్' అధిగమించింది. అయితే కమల్ హాసన్ గత చిత్రం 'ఇండియన్ 2' కలెక్షన్లను మాత్రం ఇది అందుకోలేకపోయింది. 'ఇండియన్ 2' రూ.17.9 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌ను నమోదు చేసింది.

వివరాలు 

గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు 

'థగ్ లైఫ్' సినిమాను గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా మణిరత్నం రూపొందించారు. 1987లో వచ్చిన 'నాయకన్' తర్వాత మళ్లీ మణిరత్నం, కమల్ హాసన్ కలిసి పనిచేసిన ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు శింబు (సిలంబరసన్), త్రిష కీలక పాత్రల్లో నటించారు. సంగీత విభాగానికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించటం మరో హైలైట్‌గా నిలిచింది.