Emergency OTT Release: ఓటీటీలోకి 'ఎమర్జెన్సీ'.. స్ట్రీమింగ్ తేదీ వెల్లడించిన కంగనా!
ఈ వార్తాకథనం ఏంటి
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందననే అందుకుంది.
ఈ నేపథ్యంలో త్వరలోనే ఓటిటి వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో రానుందని కంగనా తాజాగా ప్రకటించారు.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 'ఎమర్జెన్సీ' ఓటీటీ విడుదల తేదీ వెల్లడిస్తూ, మార్చి 17 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.
ఈ చిత్రం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది.
Details
మార్చి 17న స్ట్రీమింగ్
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఘటన ఆధారంగా దీనిని రూపొందించారు. సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా రనౌత్, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పడే నటించారు.
భారీ అంచనాల మధ్య విడుదలైనా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో రూ.21 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం.
థియేటర్లలో పెద్దగా సక్సెస్ సాధించని ఈ చిత్రం, ఓటీటీ వేదికపై ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.