
Kannappa: ఓటీటీలోకి కన్నప్ప.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
శివ భక్తుడిగా పేరుగాంచిన భక్త కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'కన్నప్ప'. ఈ డివోషనల్ ఎంటర్‌టైనర్‌లో మంచు విష్ణు టైటిల్ రోల్‌లో ఆకట్టుకున్నారు. అలాగే, సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో 'రుద్రుడు'గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, యోగి బాబు, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విశేషం ఏమిటంటే, విష్ణు కుమార్తెలు కూడా సినిమాలో కనిపించనున్నారు.
Details
కన్నప్ప మూవీకి ప్రత్యేక గౌరవం
'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మోహన్ బాబు, విష్ణు మంచు కలిసి నిర్మించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'కన్నప్ప' మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. మంచి విషయం ఏంటంటే, థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మంచు విష్ణు నటనకు ప్రశంసల వర్షం కురిపించగా, ప్రభాస్ చేసిన ప్రత్యేక పాత్ర కూడా పెద్ద ఆకర్షణగా నిలిచింది. పలువురు సినీ ప్రముఖులు కూడా సినిమా మీద హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన కూడా జరగడం సినిమాకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చింది.
Details
డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్
ఇప్పుడు ఈ సినిమా థియేటర్లను దాటి ఓటీటీలోకి రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, 'కన్నప్ప' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 25 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తోంది. సినిమా థియేటర్ లో మిస్ అయిన వారు జూలై 25 తర్వాత ఓటీటీలో చూసే అవకాశం దక్కనుంది.