LOADING...
Kapil Sharma: కెనడా తర్వాత దుబాయ్‌లో 'కాప్స్ కేఫ్' గ్రాండ్ ఓపెనింగ్
కెనడా తర్వాత దుబాయ్‌లో 'కాప్స్ కేఫ్' గ్రాండ్ ఓపెనింగ్

Kapil Sharma: కెనడా తర్వాత దుబాయ్‌లో 'కాప్స్ కేఫ్' గ్రాండ్ ఓపెనింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్ర‌ముఖ హాస్యన‌టుడు క‌పిల్ శ‌ర్మ ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. టెలివిజ‌న్ రియాలిటీ షోల‌ను విజ‌యవంతంగా నడిపించడంలోనే కాకుండా, దేశం, విదేశాల్లో వ్యాపారాల‌ను విస్తరించడంలో కూడా క‌పిల్ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బిజినెస్ రంగంలోనూ ఆయన అందరిని ఆశ్చర్యపరిచే పనితీరును ప్రదర్శిస్తున్నారు. కెనడాలో ఉన్న 'కాప్స్ కేఫ్' ఇప్పటికే మంచి లాభాలతో విజయవంతంగా నడుస్తోంది. కానీ కొద్దిరోజుల క్రితం కెనడాలో కొన్ని అరాచక ఘటనల కారణంగా క‌పిల్ శర్మ పేరు హాట్ టాపిక్‌గా మారింది. కపిల్‌కు చెందిన ఆ కేఫ్‌పై గ్యాంగ్‌స్టర్ల కాల్పుల సంఘటన సంచలనంగా మారింది. ఆ ఘటన తరువాత కపిల్ శర్మ భద్రత, వ్యాపారాల పరిరక్షణపై పెద్ద చర్చలు ఏర్పడ్డాయి.

వివరాలు 

దుబాయ్ స్కైలైన్ బ్యాక్‌డ్రాప్‌..

అయితే, ఇలాంటి సవాళ్లను అతడే తట్టుకొని, తన వ్యాపారాలను మరింత విస్తరించేందుకు ముందుకు పోతున్నారు. తాజాగా,కెనడా తరువాత తన రెండో 'కాప్స్ కేఫ్'ను దుబాయ్ లో ప్రారంభించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ కేఫ్‌ను గ్రాండ్‌గా ఓపెన్ చేశారు. ఈ కేఫ్ డిజైన్ కపిల్ పాపులర్ నెట్‌ఫ్లిక్స్ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సెట్ వైబ్ నుంచి ప్రేరణ పొందింది. దుబాయ్ స్కైలైన్ బ్యాక్‌డ్రాప్‌తో కపిల్ శర్మ ఒక కప్పు కాఫీ చేతిలో పట్టుకుని కస్టమర్లను ఆహ్వానిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఓపెనింగ్ మరింత వైరల్‌గా మారింది. కెనడాలోని సర్రే కాప్స్ కేఫ్ తరహాలోనే,దుబాయ్ బ్రాంచ్ కూడా హాయిగా,ఆకర్షణీయంగా అలంకరించబడింది.

వివరాలు 

'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'నాల్గవ సీజన్‌కు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ 

కాప్స్ కేఫ్ దుబాయ్ బ్రాంచ్ ప్రారంభరోజున సాయంత్రం 4గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు సేవ అందిస్తుంది. మెనూ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు,అయితే కెనడాలోని కేఫ్‌లో ఇండో-వెస్ట్రన్ ఫుడ్కు మంచి పేరు ఉంది. వడ పావ్,పాస్తా,వివిధ రకాల కాఫీలు,టీలు వంటి వంటకాలు అందుబాటులో ఉంటాయి. విభిన్నరుచుల వంటకాలు ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.అలాగే,డిజిటల్ రంగంలోనూ కపిల్ శర్మ తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'నాల్గవ సీజన్‌కు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించింది. ఈషో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో అత్యధికంగా వీక్షించబడిన టాప్ 5 నాన్-ఫిక్షన్ షోలులో రెండవ స్థానంలో నిలిచింది. నాల్గవ సీజన్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లలో ప్రియాంక చోప్రా జోనాస్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisement