Karthikeya-Bhaje Vayuvegam-Teaser Release: కార్తికేయ హీరోగా భజే వాయు వేగం...టీజర్ రిలీజ్ చేసిన చిరు
ఈ వార్తాకథనం ఏంటి
కార్తీకేయ(Karthikeya) హీరోగా రూపొందిస్తున్న సినిమా భజే వాయువేగం (Bhaje Vayuvegam).
ఈ సినిమా టీజర్ (Teaser) ఓ రేంజ్ లో అభిమానుల్ని అలరిస్తోంది.
మంచిప్రామిసింగ్ తో కనిపిస్తున్న ఈ టీజర్ ను ప్రముఖ నటుడు, టాలీవుడ్ దిగ్గజమైన చిరంజీవి శనివారం విడుదల చేశారు.
యువీ క్రియేషన్స్ సమర్పణలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా, చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ 'విశ్వంభర' షూటింగ్ సెట్లో శనివారం భజే వాయువేగం చిత్ర యూనిట్ వెళ్లి చిరంజీవితో టీజర్ ను రిలీజ్ చేయించారు.
ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Bhaje Vayuveygam-Teaser Release
హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: చిరంజీవి
చంద్రపు ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా యూవీ క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తోంది.
టీజర్ రిలీజ్ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...''నా అభిమాని ఓ హీరోగా ఓ మంచి సినిమాలో నటిస్తున్నాడంటే ఆ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటాను.
టీజర్ చూస్తుంటే ఇది ఓ తండ్రి, కొడుకు మధ్య సాగే ఓ సీరియస్ ఎమోషన్ లా కనిపిస్తోంది.
కార్తికేయ బాగా నటించారు.
యాక్షన్ సీన్లు బాగున్నాయి.
ఈ సినిమా కథ నాకు తెలిసినప్పటికీ ఇంతకంటే ఎక్కువగా లీక్ చేయాలనుకోవడంలేదు' అని చెప్పారు.