
Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ గర్భవతిగా ఉందా? వీడియో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్,నటుడు విక్కీ కౌశల్ వివాహం సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు అందరినీ ఆశ్చర్యపరిచింది.
బి టౌన్ పవర్ కపుల్స్‌లో కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్ ఒకరు. ఈ జంట తమ ప్రేమతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి 2021 డిసెంబర్ నెలలో వివాహమైంది.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో కత్రినా కైఫ్, ఆమె భర్త విక్కీ కౌశల్ కూడా హాజరయ్యారు.
జామ్‌నగర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె గర్భవతి అనే వార్త మళ్లీ వైరల్ అవుతోంది.
Details
బేబీ బంప్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారని నెటిజన్లు కామెంట్స్
కత్రినా కైఫ్,విక్కీ కౌశల్ జామ్‌నగర్ నుండి తిరిగి వస్తుండగా ముంబై విమానాశ్రయంలో పొట్టభాగం కనపడకుండా.. దుపట్టాతో కవర్ చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, దాంతో కత్రినా గర్భంతో ఉందని, అందుకే బేబీ బంప్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అయితే దీనిపై ఈ స్టార్ కపుల్ స్పందించలేదు. ఇటీవలే బాలీవుడ్ నటి అనుష్క శర్మ మగ బిడ్డకు జన్మనిచ్చారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా తాను తల్లికానున్నట్లు ప్రకటించారు.